భారతమాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ జయంతి నేడు –(28th September)

జోహార్ భరత వీర.. జోహార్ పుడమి పుత్ర జోహార్ జోహార్…

దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన వ్యక్తిలలో భగత్ సింగ్ ఒక్కరు. భారత ఇతిహాసాలలో పెరెన్నికగలిగిన మహానుభావులు ఉన్నప్పటికీ, వారిని మించిన వీరుడుగా, అమరుదుగా స్వాతంత్ర సంగ్రామ చరిత్రిలో భగత్ సింగ్ నిలిచిపోతారు. చిన్న వయసులోనే తెల్ల దొరలు వేసిన భారతమాత సంకెళ్లను తెంచే వయసులో ఉరికంభం ఎక్కడానికి వెనకంజు వేయడానికి వెనకాదని ధీరుడు. తన త్యాగ నిరతితో యావత్ దేశ ప్రజలను మూక్యంగా యువతను ప్రేరేపించాలని నమ్మడు. ;దీనికి అహింస, సత్యాగ్రహం, సహాయనిరాకరణ తోడై. దేశానికి స్వతంత్రం సాదించడంలో చరిత్రకెక్కాడు. తాను కన్నా కలలు సాకారం చేసుకోగలిగిన భారతమాత ముద్దుబీడ్డ భగత్ సింగ్. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 నపంజాబ్ లోని లయార్పూర్ జిల్లా, బంగా గ్రామంలోని స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో మూడవ సంతానంగా విద్యావతి, కిషన్ సింగ్ దంపతులకు జన్మించాడు. సహజంగానే. భగత్ సింగ్ కు దేశభక్తి లక్షణాలు అలవడ్డాయి. నాల్గోవా తరగతి చదువుతున్న భగత్ సింగ్ ను ఉపాద్యాయులు ప్రశించినప్పుడు, తడుముకోకుండా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమేస్తానని సమాదనం ఇచ్చిన ధైర్యవంతుడు. 1919 జలియన్‌వాలభగ్ సమయంలో భగత్ సింగ్ 12 సంవస్తరాల యువకుడు. సంఘటన స్థలాన్ని సంధర్సించాలని పాఠశాలనుంచి నేరుగా పోలీస్ ప్రహారాన్ని చేదించి పోలీసుల కాల్పూలలో చనిపోయిన వ్యక్తుల రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకొచ్చి చనిపోయిన అమరులకోసం పూజలు జరిపాడు. కుటుంభ సహకరంతో స్వతంత్ర సాంగ్రమంలో చేరి 1922 లో చౌరా చోరీ సంఘటనవలన మహాత్మా గాంధీ సహాయ నిరాకరణను నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణించి, దేశ ప్రజలను బ్రిటిష్ బానిసత్వంనుంచి విడదీయాలంటే, సాయుధ పోరాటామే సరణ్యమని విశ్వాసించాడు. అఖండ భారతాన్ని ఉహించుకొని దేశ స్వతంత్రం కోసం కళలు కన్నాడు. దేశ ప్రజల, భారతమాత స్వేచా కోసం తన జీవితాన్ని అర్పించడానికి సిద్దమైనాడు. తన చెస్టలవలన, భారతమాత దాస్య శృంఖలాలను తెంచాలని ప్రతిన భూనాడు. లాలాలజపతిరై నేతృత్వమలో 1928 లో సైమన్ కమిషన్ ను వ్యతిరేకించి లాహూర్‌లో పెద్ద ర్యాలీ నిరవహించారు. సైమన్ కమిషన్న్ని ప్రజలు అడ్డుకోవడం తో తీవ్రంగా పరిగినిచిన పోలీస్ బాస్ ఎస్పీ స్కాట్ లాఠీతో విరుచుకుపడ్డారు క్రమంలో సాన్డర్సన్ అనే పోలీస్ అధికారి అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న లాలలాజపతిరై ని చాతిపై తన్నడం తో నెలరోజుల తర్వాత లజపతిరై చనిపోవడం జరిగింది. దీనితో స్కాట్ ని ఛంపాలని చెంద్రశెకర్ ఆజాద్ పథకం పన్నాడు ఆ బాద్యతలో భాగంగా స్కాట్ కదలికల భాద్యతను విప్లవకరకుడు జైగోపాల్ కి అప్పగించి. హత్య బాద్యతను భగత్ సింగ్కు, రజ్‌గురు కు అప్పగించాడు. కానీ సాన్డర్సన్ ను స్కాట్ గా భావించి పొరపాటున సాన్డర్సన్ ను కాల్చి చంపారు. ఈ సంఘటన బ్రిటిష్ కి అహ్చర్యం కలిగించి కసీతీర్చు కోవాలం సంకల్పంతో భారతీయులప్ విరుచుకు పడ్డారు. దీన్ని సహించలేని కొంతమంది విప్లవకారులు స్వచంద్డంగా అరెస్ట్ అయ్యారు. ఈ ఉదంతం తర్వాత మూడు నెలలకు భారత దేశానికి ఇబ్బంది పెట్టె రెండు ప్రధాన బిల్లులను బ్రిటిష్ ప్రభుత్వం సెంట్రల్ హాల్ లో ప్రవేశపెట్టాలని అనుకుంది. ఈ రెండు బిల్లులను అసెంబ్లీ తిరస్కరించిన, బ్రిటిష్ విశేష అధికారాలతో తీర్మానించవచ్చని భావించి హింధుస్తాన్ సమాజవధి ప్రజాతంత్ర బ్రిటిష్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. సెంట్రల్ హాల్ లో పొగ బాంబ్ విసిరి భారత ప్రజలకు సందేశం ఇవ్వాలని తలచి తదనంతరం అరెస్ట్ కావాలని నిశ్చయించారు. కానీ భగత్ సింగ్ ఈ అవకాశం తనకివ్వమని, తనకు సహాయకుడుగా బతుకేశ్వర్ దత్త్ ను పంపమని భగత్ సింగ్ కోరాడు. 1929, ఏప్రిల్ 8న భగత్ సింగ్, సహాయకుడు బతుకేశ్వర్ దత్త్ సెంట్రల్ హాల్ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎవ్వరికీ హాని చెయ్యని రెండు బాంబ్ లను విసిరి, వారి సిద్ధాంతాలకు సంబందించిన కరపత్రలను విసిరారు. చేతిలోని పిస్తోళ్లును క్రింద పడేసి స్వచద్దంగా చేతులకు బేడీలు వేయించుకున్నారు. ఈ సంఘటన ప్రపంచ దృష్టి ఆకర్షించింది. బ్రిటిష్ ప్రభుత్వం వోణికిపోయింది. స్వల్ప గాయాలు తప్ప ఎవ్వరూ ఈ సంఘటనలో చనిపోకపోయిన కరడుగట్టిన విప్లవకారులుగా బ్రిటిష్ వీరిని చిత్రీకరించడం జరిగింది. భగత్ సింగ్, దత్త్ ని జైల్ కి పంపింది. జైల్లో ఉండగాని, తన భవనాలను ఉత్తరలద్వారా ప్రజలకు పంపుతూ చైతన్య పరుస్తూ భగత్ సింగ్ ఉండేవాడు. లాహుర్ కుట్ర కేస్ లో భగత్ సింగ్ వారి అనుచరులపై జరిగిన కోర్ట్ విచారణ ప్రపంచాన్ని ఆకర్శించింది. భగత్ సింగ్, రజ్‌గురు, సుఖదేవ్ లకు ఉరిశిక్ష పాడగా, వారి అనుచరులకు జైలు శిక్ష కోర్ట్ వేయగా. ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి శిక్షను నిలిపివేయాలని ఆగ్రహించడం జరిగింది. ఫలితం లేకపోగా 1931మార్చ్ 24 న ఉరి శిక్ష అమలు చేయాలని నిచ్చాయించారు. కుటుంభ సభలను కూడా అనుమతించకుండా అనుకున్న సమయానికాన్నా ముందే మార్చ్ 23 రాత్రి ఏడున్నరకు ఉరి అమలు చేశారు. సుఖదేవేను ముందు, భగత్ సింగ్ ను తర్వాత, ఆఖరుగా రాజ్గురు కు శిక్ష అమలు చేశారు. ఉరి అమలు జరుగుతున్న సమయంలో “భారత్మాతకు జై” అంటూనే ప్రాణం విడిచి దేశ స్వతంత్రం కోసం అమరులయ్యారు. గుండసింఘ్ వల అనే గ్రామంలో అత్యంత రహస్యంగా అమరుల పార్థివ దేహాలను ఖననమ్ చేసి మిగిలిన అవశేషాలను సట్లాజ్ నదిలో విసిరేశారు. ఈ సంఘటనలో లాహోర్ వచ్చిన గాంధీజీ పై స్థానికులు కోడిగ్రడ్లు విసిరి అవమానపర్చడం జరిగింది. దేశ స్వతంత్రం కోసం ఆసువులు బాసిన అమరుల ముగ్గురు చితభస్మం ఆనవాళ్ళు లేకుండా చేసిన దుస్సాంఘటనను ఎంతో మంది భారతీయులు గుర్తు చేసుకుంటుంటారు. వారి స్పూర్తి నేటి తరానికి అవసరం. మన దేశ ఘనమైన సంస్కృతికి వరసులమనుకున్న దేశ ప్రజలకు, మూక్యంగా యువత కు భగత్ సింగ్ ఆధర్స్యము. భగత్ సింగ్ చనిపోలేదు. ఆయన అమరుడు. ఈ దరిత్రి ఉన్నంత వరకు భారతీయుల హృదయాలలో భగత్ సింగ్ స్థానం పదిలం. నేడు భగత్ సింగ్ జయంతి కనుక ఆయనను స్మరిద్దం, ఆయన ఆశయాలను దేశభక్తి రూపంలో చాటుద్దాం.

ప్రకటనలు

‘‘పుష్పవిలాపం’’

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు

ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారము చేసాము

గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే

యింతలో ఒక గులాబి బాల కోపంతో మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి,
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట దయలేనివారు మీ యాడవారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జెవితమెల్ల మీకయి త్యహించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా

:వోయీ మానవుడా

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభు.

ఆధారం: కరుణశ్రీ గారి పుష్పవిలాపం నుండి

అవధానం

అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ – వీటన్నిటినీ ఏక కాలంలో – అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధానం స్వరూపం
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం – రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
• వేదసంబంధ అవధానాలు: స్వరావధానం, అక్షరావధానం .
• సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం… ఇలా 20దాకా ఉన్నాయి.
• సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
• సాంకేతిక అవధానాలు: నేత్రావధానం, అంగుష్టావధానం మొదలగునవి.
• శాస్త్ర సంబంధ అవధానాలు: గణితావధానం, జ్యోతిషావధానం, వైద్యావధానం, అక్షరగణితావధానం .
• కళా సంబంధ అవధానాలు: చిత్రకళావధానం, నాట్యావధానం, సంగీతాష్టావధానం, చతురంగావధానం, ధ్వన్యవధానం .
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు ,ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగమ లో బహుళ ప్రచారం లో ఉన్న పద్యం ‘జెండాపై కపిరాజు ‘ ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగం లోనే పాడగా మనం విన్నాము. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగం లో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.
అష్టావధానము
ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
1. కావ్య పాఠము
2. కవిత్వము
3. శాస్త్రార్థము
4. ఆకాశపురాణము
5. లోకాభిరామాయణము
6. వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
7. చదరంగము
8. పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో “ధారణ” తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.

అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి. వాటిని – వాటి వివరణను గమనించండీ.
1.నిషిద్ధాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధాని గారిని కోరతాడు. అవధానిగారు ఆ విషయం మీడ ఒక చందస్సులో ఒక పద్యం మెదలెడతాడు ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అనగా ఆ అక్షరం ఉపయోగించ కూడదని. అవధాని గారు ఆ అక్షరాన్ని వదలి వేరే అక్షరం తో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని గారు పద్యభావం చేడకుండా నిషిద్దాక్షరిని వాడకుండా…. పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని గారు ఆ పద్యంలో రెండు మూడు పదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను మరియు తెలుగులో మాత్రమే వునటు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహా భూషణము
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని – శ, ష, స, హ – లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని గారు ఇలా చెప్పారు.
డమరుకమును మ్రోగించుచు నమరించెను మానవులకు ‘ అఆ ‘ మాలన్ కమనీయముగా వ్రాయగ నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
2. న్యస్తాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ పద్యంలోని నాలుగు పాదాలలో ఫలాన స్తానంలో పలాన అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని గారు వృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. ఆ పద్యాన్ని ఒక్కసారే చెప్పడానికి వీలు లేదు. పద్య పూరణ కొంత అవగానే మరొక వృచ్చకుడు మరో సమస్యనిస్తాడు. అవధాని గారు అప్పటి వరకు చెప్పిన పద్య భాగాన్ని గుర్తుంచుకొని మరో సమస్య మీదికి మనసును కేంద్రీక రించాలి.
3.దత్తపది
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాక పోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడ ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణ గా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతా. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదానిగారు ఆయా పదాలను పయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవదాని గారు అంతవరకు చెప్పిన పద్య భాగాని అలాగె గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి.
4.సమస్యా పూరణం.
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే …… అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
5. వర్ణన
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి.
6. ఆశువు
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా , ఆలోచించుకోకుండా వెంటనే ఆసువుగా చందోభద్దమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి అవధాని గారు.
7.పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబందం, కావ్యం ఇలాంటి గ్రంధాలలో ఒక ప్రథాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ….. ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు…. పురాణ పక్కీలో చెప్పాలి… అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా……. మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని ‘కొంత సేపు ఆగు ‘ అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
8.అప్రస్తుత ప్రసంగం:
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్త్గాడు. ఉదాహరణకు…… అవధానిగారూ….. నిన్న ఇదే సమయానికి మీరెక్కడున్నారు….. ఏమి చేస్తున్నారు చెప్పండి అంటాడు. దానికి సమాధానంగా అవధానిగారు మామూలుగా అడిగిన దానికి సమాధానము చెప్పడము కాదు… ఆ కొంటె ప్రశ్నకి సమాధానం మరింత కొంటెగా సభాసధులందరూ ఆహా అని మెచ్చుకునే టట్లు సమాధానం చెప్పాలి.
వివరాలు
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు…. ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ……. మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక్ ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్య క్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్య క్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో…….
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం , గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడ పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అది ని భందన.
శతావధానము

వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.
సహస్రావధానము
ద్వి సహస్రావధానము
త్రి సహస్రావధానము
నాట్యావధానము
గణితావధానము
ఘంటావధానము
నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం
ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం వ్రాసి ఇస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.
కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం… లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.
అష్టావధానం లోని ప్రక్రియలు
పుష్ప గణనము
పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
ఆశువు
ఆశువు లేదా ఆశుకవిత్వం. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదనైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.
నిషిద్ధాక్షరి
నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్
నిర్దిష్టాక్షరి
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను వ్రాసి ఇస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.
ఘంటా గణనం
ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.
అప్రస్తుత ప్రసంగం
అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన “అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి” అని అడిగారు. దానికి అవధాని… “పళ్లెం నిండా శుభ్రంగా వడ్డించవే” అని భర్త అంటే “కోరినంత తినండి” అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. “హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా” వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
శతావధాన సహస్రావధానాలలో సాధారణంగా ఉండే అంశాలలో కొన్ని….1. సమస్యాపూరణం 2.దత్త పది 3.వర్ణన 4.ఆశువు 5.నిషిద్ధాక్షరి 6.నిర్దిష్టాక్షరి 7.వ్యస్తాక్షరి 8.న్యస్తాక్షరి 9.చందోభాషణం 10.పురాణ పఠనం 11.శాస్త్రార్థము 12.ఏకసంథా గ్రహ్ణం 13.వివ్ర్గాక్షరి 14.అనువాదం 15.చిత్రాక్షరి 16.అక్షర విన్యాసం 17.స్వీయ కవితా గానం 18.వార గణనం 19.పంచాంగ గణనం 20.పుష్ప గణనం 21.ఘంటా గణనం 22.అప్రస్తుత ప్రసంగం 23.కావ్యానుకరణం 24.సంగీతం 25.మీ ప్రశ్నకు నా పాట మొదలగునవి.
కొందరు అవధానులు
• అవధాని జగన్నాథ పండిత రాయలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ నే తన ధారణా శక్తితో మెప్పించిన దిట్ట.
• అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (1864-1945)
• తిరుపతి వేంకట కవులు గా ప్రసిద్ధులైన జంటకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి (1871-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) – వీరు అవధాన ప్రక్రియకు తమ కాలంలో జీవం పోసి ఎనలేని ప్రజాదరణ సాధించారు. వీరి పాండిత్యాన్ని, చమత్కార చతురతను గూర్చి ఇప్పటికీ సాహితీ ప్రియులు కథలు కథలుగా చెప్పుకొంటారు.
• కొప్పరపు సోదర కవులు – (కొప్పురపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి) తిరుపతి వేంకట కవుల సమకాలీనులు. మెరుపు వేగంతో పద్యాలను అల్లడం వీరి ప్రత్యేకత.
• వేంకట రామకృష్ణ కవులు – తిరుపతి వేంకట కవుల సమకాలీనులు
• పిసుపాటి చిదంబరశాస్త్రి – 1930-40 లలోని గొప్ప అవధానులలో ఒకడు
• వేంకట రామకృష్ణ కవులు – ప్రఖ్యాత జంట కవులు
• రాజశేఖర వేంకట కవులు – ప్రఖ్యాత జంట కవులు
• పల్నాటి సోదరులు – ప్రఖ్యాత జంట కవులు
• దేవులపల్లి సోదర కవులు – వీరు ముగ్గురు
ఆధునిక కాలంలో
• డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి మహా సహస్రావధాని అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనీ బిరుదులు పొందాడు.
• దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సి ని మాత్రం పాలకొల్లు లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండ లో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
• డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
• డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
• కడిమెళ్ల వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపత్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది “గురు సహస్రావధాని”గా పేరొందారు.
• సురభి శంకర శర్మ. తెలుగులోను, సంస్కృతంలోను కూడా అవధానాలు నిర్వహించగల దిట్ట.
• అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
• డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ వివిధ నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టాడు.500పైగా అవధానాలు చేశాడు. తెలంగాణలో-
• డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
• రాంభట్ల పార్వతీశ్వర శర్మ బాల కవి, 20 ఏళ్ళ వయసులో 12 అష్టావధానాలు చేశాడు. “శ్రీ రాంభట్ల వేంకటీయము” అనే లఘు పద్యకావ్యం వ్రాసాడు. చదివింది బియస్సీ మైక్రో బయాలజీ… చదువుతూ ఉన్నది ఎమ్మే తెలుగు, ఆంధ్ర విశ్వకళా పరిషత్.
• నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్ఠావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
==పంచసహస్రావధానులు==
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , మేడసాని మోహన్
==ద్విసహస్రావధానులు ==
మాడుగుల నాగఫణి శర్మ.
==సహస్రావధానులు==
మేడసాని మోహన్ , మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి ప్రభాకర్ , గరికపాటి నరసింహారావు.
== పంచశతావధానులు==
మాడుగుల నాగఫణి శర్మ.
==ద్విశతావధానులు ==
రాళ్ళబండి కవితా ప్రసాద్ , కడిమిళ్ళ వరప్రసాద్ , గరికపాటి నరసింహారావు , మాడుగుల నాగఫణి శర్మ.
== –శతావధానులు
==
చెఱువు సత్యనారాయణ శాస్త్రి ,సి.వి.సుబ్బన్న , నరాల రామారెడ్డి , గండ్లూరి దత్తాత్రేయ శర్మ ,బూరాడి గున్నేశ్వర శాస్త్రి , మేడసాని మోహన్ , గరికపాటి నరసింహారావు , రాళ్ళబండి కవితా ప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి పద్మాకర్ , పల్నాటి సోదర కవులు, చల్లా పిచ్చయ్య శాస్త్రి , అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, దోర్భల ప్రభాకర శర్మ]] , దోకూరి కోట్ల బాల బ్రహ్మచారి , జాను దుర్గా మల్లికార్జున రావు ,కొండపి మురళీ కృష్ణ , గౌరీభట్ల వెంకటరామ శర్మ ,శ్రీ రామ నరసింహమూర్తి కవులు , కడిమిళ్ళ వరప్రసాద్, సురభి శంకర శర్మ. కోట వెంకట లక్ష్మీనరసింహం , మాడుగుల వెంకట సూర్య ప్రసాదరాయ కవి , పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ , జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , భూతపురి సుబ్రహ్మణ్య శర్మ , భూతపురి బాల సుబ్బారాయుడు , పోచిన పెద్ది సుబ్రహ్మణ్యం , పాణ్యం నరసరామయ్య , రొంపిచర్ల శ్రీనివాసా చార్యులు…
== అష్టావధానులు==
ప్రసాదరాయ కులపతి ,దివాకర్ల వెంకటావధాని , ధూళిపాళ మహదేవమణి , గౌరీభట్ల రఘురామ శర్మ ,బేతవోలు రామబ్రహ్మం , దూపాటి సంపత్కుమారాచార్య , [[కోవెల సుప్రసన్నా చార్య [[, విఠాల చంద్రమౌళి శాస్త్రి , చిఱ్ఱావూరి శ్రీరామ శర్మ , ఆర్.అనంత పద్మనాభరావు , మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ ,తిగుళ్ళ శ్రీహరి శర్మ , మాడుగుల అనిల్ కుమార్ , సురభి వెంకట హనుమంతు రావు , గణపతి అశోక్ శర్మ , ఇందారపు కిషన్ రావు , మేడూరు ఉమామహేశ్వరం , గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు , మరింగంటి కులశేఖరా చార్యులు , కర్రా గోపాలం , కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు , కట్టమూరు చంద్రశేఖర్ , లోకా జగన్నాధ శాస్త్రి , అయాచితం నటేశ్వర శర్మ , చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ , అష్టకాల నరసింహరామ శర్మ , వెల్లాల నరసింహ శర్మ ,కేసాప్రగడ సత్యనారాయణ , గురువేపల్లి నరసింహం ,రాళ్ళబండి నాగభూషణ శర్మ ,కురుబ నాగప్ప , పూసపాటి నాగేశ్వర రావు , అందె వెంకటరాజం , రాంభట్ల పార్వతీశ్వర శర్మ , కావూరి పూర్ణచంద్రరావు , ముటుకుల పద్మనాభ రావు , ఆశావాది ప్రకాశరావు , పేరాల భరత శర్మ , పరవస్తు ధనుంజయ , నారాయణం బాల సుబ్రహ్మణ్య శర్మ , మేడవరం మల్లికార్జున శర్మ ,సమ్మెట మాధవ రావు , అవధానం రంగనాధ వాచస్పతి , వేదాటి రఘుపతి , ఆరుట్ల రంగాచార్య ,బులుసు వెంకట రామమూర్తి ,గడియారం శేషఫణి శర్మ , ఆమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్,పాలపర్తి వేణుగోపాల్ ,దిట్టకవి శ్రీనివాసాచార్యులు , దోనిపర్తి రమణయ్య , శంకరగంటి రమాకాంత్ , ముద్దు రాజయ్య , తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, గౌరీభట్ల రామకృష్ణ శర్మ , కోట రాజశేఖర్ , చిలుకూరి రామభద్ర శాస్త్రి , పరిమి రామ నరసింహం , బెజుగామ రామమూర్తి , పణితపు రామమూర్తి , జోస్యుల సదానంద శాస్త్రి , మద్దూరి రమమూర్తి , చిలుకమర్రి రామానుజాచార్యులు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ , పణతుల రామేశ్వర శర్మ , పాణ్యం లక్ష్మీనరసింహ శర్మ , చక్రాల లక్ష్మీకాంత రాజారావు ,శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు , పుల్లాపంతుల వెంకట రామశర్మ , దేవులపల్లి విశ్వనాధం , వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు , పణిదపు వీరబ్రహ్మం , భద్రం వేణు గోపాలా చార్యులు ,రావూరి వెంకటేశ్వర్లు , గుమ్మా శంకర రావు , ప్యారక శేషాచార్యులు ,మామిళ్ళపల్లి సాంబశివ శర్మ , నేమాని రామజోగి సన్యాసి రావు , కొప్పరపు సీతారామ వరప్రసాద రావు , శనగల సుందరరామయ్య , అవధానం సుధాకర శర్మ , పైడి హరనాధ రావు , పమిడికాల్వ చెంచు సుబ్బయ్య , తావి కృష్ణ శర్మ ,వడిగేపల్లి నరసింహులు , మేడికుర్తి పుల్లయ్య , కె.ప్రభాకర్ , పుల్లపంతుల రాధాకృష్ణ మూర్తి , బి.శ్రీనివాసాచార్యులు , అక్కపెద్ది రామసూర్యనారాయణ , సురభి శంక శర్మ , ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , ఎస్.ఎ.టి.కె. తాతాచార్య , ఫణితపు శ్రియ:పతి , సి.విజయకుమార్ , గోవర్ధనం నరసింహా చారి , ఎం.కె.ప్రభావతి , తంగిరాల ఉదయ చంద్రిక , పుల్లాభట్ల శాంతి స్వరూప , కొంపెల్ల కామేశ్వరి,బులుసు అపర్ణ , ఆకెళ్ళ దుర్గ నాగసత్య బాలభాను మున్నగువారు.
మూలం: వికీపిడియా

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు రాసినవే! రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

పంచారామాలు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.

1.దాక్షారామము –
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

2.అమరారామము –
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.

3.క్షీరారామము –
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.

4.సోమారామము –
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.

5.కుమార భీమారామము –
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

గిడుగు వారి భాష, సాహిత్యం,సామాజిక దృక్పథం

గిడుగు వారి భాష, సాహిత్యం,సామాజిక దృక్పథం
భావవాదమే ఆయన ప్రాపంచిక దృక్పథమైనా భాషా వ్యవహారంలో మాత్రం సామాజిక వాస్తవాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా గిడుగు రామమూర్తి కనిపిస్తున్నారు. ఎందుకంటే, ఉద్యోగరీత్యా సవరలు అధికంగా నివసించే పర్లాకిమిడి ప్రాంతంలో తన జీవితాన్ని అంతటినీ గడిపారు. ఆ అవసరాలు, అప్పటికే సంస్కరణవాది అయిన గురజాడ అప్పారావుతో పరిచయం ఉండడం వంటివన్నీ భాష పట్ల ఆయనకు ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించి ఉండొచ్చు.

గిడుగు వేంకట రామమూర్తి పేరు చెప్పగానే తెలుగు వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన వాళ్ళలో ఆయన ఒక ప్రముఖుడిగా, సవర భాషా సంస్కృతులపై విశేషమైన కృషి చేసిన వ్యక్తిగా గుర్తుకొస్తాడు. అయితే, ఆనాడు గ్రాంథిక భాష ప్రాచుర్యంలో ఉండగా వ్యావహారిక భాష కావాలని వాదించడంలోగల సామాజిక పరిస్థితులు, ఆయనపై చూపిన ప్రభావాలను గుర్తించాల్సి ఉంది. అలాగే ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి పెరిగినా, సవరల గురించి పరిశోధనలు కొనసాగించడంలో గల ఆంతర్యాన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది. అసలు ఆయన ప్రాపంచిక దృక్పథం ఏమిటి? ఆయన భాషకే పరిమితమైయ్యారా? లేక సృజనాత్మక సాహిత్యంకూడా రాశారా? సాహిత్యంపట్ల ఆయన అభిప్రాయలేమిటి? ఆయన రాసిన సాహిత్యంలో కనిపించే సమాజం ఎవరిది? మొదలైన ప్రశ్నలకు కొన్ని సమాధానాల్ని అన్వేషించడమే ఈ ప్రయత్నం

జీవితం- దృక్పథం
గిడుగు రామమూర్తి కుమారుడు (గిడుగు సీతాపతి) రాసుకున్న స్వీయ చరిత్ర (1962), ఆయనే రాసిన గతకాలపు స్మృతులు వ్యాసం (1964), గిడుగు వారి స్మారక సంచిక (1940), భారతి, కృష్ణాపత్రిక తదితర పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, సవర భాషపైనా, వ్యావహారిక వాదాల సందర్భంగా రాసిన వ్యాసాలు, వీటిపైనే ఆధారపడి ఇతరులు రాసిన మరికొన్ని వ్యాసాలు, ఉత్తరాలు, చేకూరి రామారావు, నడుపల్లి శ్రీరామరాజులు సంకలనం చేసి సంపాదకత్వం వహించి డెట్రాయిట్‌ తెలుగు లిటరరీ క్లబ్‌ (2005) ప్రచురించిన మరో సారి గిడుగు రామమూరి (వ్యాసాలు, లేఖలు) పుస్తకం- ప్రధానంగా గిడుగు వారి జీవితాన్ని, ఆయన దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి.

గిడుగు రామమూర్తి పూర్వీకులు నేటి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర్లోని ఇందుపల్లి వాస్తవ్యులు. తర్వాత కాలంలో విజయనగరం దగ్గర్లోని పర్వతాల పేటకు వలస వెళ్ళారు. అక్కడే వెంకమ్మ, వీర్రాజులకు 1863 ఆగస్టు 29న రామమూర్తి జన్మించారు. నేటికీ ఇందుపల్లి ప్రాంతంలో వీరి కొబ్బరి తోటలు ఉన్నాయని రామమూర్తి కుమారుడు సీతాపతి ఒక వ్యాసంలో ప్రకటిం చారు. ఆయనకు దైవం పట్ల నమ్మకం ఉందని వీరేశలింగం కి రాసిన లేఖను బట్టి తెలుస్తుంది. కాబట్టి భావవాదమే ఆయన ప్రాపంచిక దృక్పథమైనా భాషా వ్యవహారంలో మాత్రం సామాజిక వాస్తవాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా గిడుగు రామమూర్తి కనిపిస్తున్నారు. ఎందుకంటే, ఉద్యోగరీత్యా సవరలు అధికంగా నివసించే పర్లాకిమిడి ప్రాంతంలో తన జీవితాన్ని అంతటినీ గడిపారు. ఆ అవసరాలు, అప్పటికే సంస్కరణవాది అయిన గురజాడ అప్పారావుతో పరిచయం ఉండడం వంటివన్నీ భాష పట్ల ఆయనకు ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించి ఉండొచ్చు. ప్రాచీన కావ్యాల్లో కూడా వ్యావహారిక భాషను చూపించే ప్రయత్నం చేసి, ప్రజల వాడుకలో ఉంటేనే భాష నిలుస్తుందనేది ఆయన వాదం. మనం మాట్లాడుకునే భాషలోనే రచనలు కూడా వస్తే బాగుంటుందనీ, ఎక్కువమందికి విజ్ఞానం అందుబాటులోకి వస్తుందనేది ఆయన ఆశయం. అందుకోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అతిశయోక్తితో పొగిడేసినవాళ్ళున్నారు. `గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషావాదం లేవనెత్తడంతో తెలుగు కావ్యభాషాస్వరూపం మారిపోయింది’ అని శ్రీశ్రీ అన్నారు. నిజానికి గిడుగు వారు వ్యావహారిక భాషావాదానికి కృషి చేసినా, ఆయన జీవించిన కాలంలోనే అది సంపూర్ణంగా విజయవంతం కాలేదు. ఆ విషయాన్ని గిడుగు వారే స్వయంగా చెప్పుకున్నారు కూడా. కానీ, ఆ ప్రయత్నాలు- తర్వాత కాలంలో విజయవంతం కావడానికి తోడ్పడ్డాయనుకోవచ్చు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఆధునిక వ్యావహారిక భాషను పరీక్షల్లో రాయగలిగే అవకాశంఉంటే సామాన్య, మధ్యతరగతివారికి కూడా విద్యార్జనకు అవకాశం కలుగుతుందనేది- భాషా వ్యవహారానికి సంబంధించిన ఆయన దృక్పథమని గుర్తించవచ్చు.

సవరలను అత్యంత దగ్గరగా పరిశీలించడంతో వారి గురించి లోకానికి తాను గమనించిన వాస్తవాల్ని తెలపాలనే జిజ్ఞాసే ఆయనను సవరలపై పరిశోధనకు పురిగొల్పి ఉంటుంది. అయితే, సవరలపై పరిశోధన చేయడానికి ఆయనకున్న మానవతాదృష్టే ప్రధాన కారణంగా చేకూరి రామారావు వ్యాఖ్యానించారు. సవరభాష నేర్చుకుంటేనే, వారితో బాగా కలిసిపోవచ్చు అనుకున్నారు. `హరిజనోద్ధరణ జరగడానికి 40 సంవత్సరాల ముందే 1894 ప్రాంతంలోనే గిరిజనులైన సవరలు (శబరులు)- వాళ్ళలో మళ్ళీ అంటరానివాళ్ళని తన ఇంటి దగ్గర పెట్టుకొని, దగ్గరగా కూర్చొని సవరభాష నేర్చుకున్నారు’ అని సంస్కర్తగా గిడుగువారిని అడపా రామకృష్ణారావు అంచనా వేశారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు గిడుగు రామమూర్తి అగ్రస్థానంలో సామాజిక గౌరవానికి నోచుకున్న వర్గంనుండి వచ్చినప్పటికీ, తన జీవితావసరాల రీత్యా సమాజంలో అట్టడుగు వర్గాలవారితో జీవించాల్సిన పరిస్థితుల్లో ఆయన జీవిత దృక్పథంలో మార్పు వచ్చిందని అనుకోవచ్చు. అదే ఆయన భాషాదృక్పథాన్నీ ప్రభావితం చేసి ఉంటుంది. `పేదవాళ్ళకి, పసిపిల్లలకు, స్త్రీలకు వాళ్ళకు అర్థమైన భాషలో విజ్నాన బోధ రామమూర్తిగారికి వ్యావహారిక భాషా వాదానికి లక్ష్యం. అదే ఆయన జీవితాశయం’. గురజాడ వారు మద్రాసు విశ్వవిద్యాలయం వారికి సమర్పించిన `డిసెంటు పత్రం'(అసమ్మతి పత్రం) లో ఉన్నటువంటి వాదనే గిడుగు వారి వాదనలోనూ కనిపిస్తుందని భాషావేత్తల అభిప్రాయం.

సాహిత్య దృక్పథం
కవిత్రయ మహాభారతం అంటే గిడుగు వారికి చాలా ఇష్టం. కథలు కూడా చదివే వారు. వాటి గురించి నిర్మొహమాటంగా మాట్లాడేవారు. యీసఫ్‌ కథలను సవరభాషలోకి అనువాదం చేశారు.1919లో `తెలుగు’ పత్రికను స్థాపించి, కేవలం భాషకు సంబంధించినవే కాకుండా సృజనాత్మక సాహిత్యానికికూడా ప్రాధాన్యాన్నిచ్చేవారు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలను తిప్పి కొట్టాలని ఈ పత్రికను నడిపారు. 1914లో `నిజమైన సంప్రదాయం’ పేరుతో చిన్న పుస్తకాన్ని రాశారు. `వచన సాహిత్యం వ్యావహారిక భాషలో రాయడమే నిజమైన సంప్రదాయం’అని వాదించడమే ఈ రచన లక్ష్యం.

1932లో `అప్పకవీయ విమర్శనము’ తాళపత్రకావ్యాలను పరిశీలించి రాసిన గ్రంథాన్ని బట్టి గిడుగు రామమూర్తి సాహిత్యాధ్యయనం విస్తృతంగానే చేసేవారని తెలుస్తుంది. చిన్నయసూరి `నీతిచంద్రిక’ రెండవ ముద్రణను రామమూర్తిగారే ప్రచురించడంవల్ల సాహిత్యం ద్వారా భాషావ్యాప్తి కలుగుతుందని భావించారు. `ఆంధ్రపండిత భిషక్కలు- భాషా భేషజం’, `బాల కవిశరణ్యం’ పుస్తకాల్లోని భావాలను ముందుగా `తెలుగు’ పత్రికలోనే ప్రచురించారు. `వ్యావహారిక భాషలో వ్రాసినపుడు కావ్యమెంత రసవంతంగా వుంటుందో నీకు అనుభవం మీద కాని తెలియదు. ఏదీ నీ కలాన్ని ఒక్కసారి అటువైపు తిప్పు’ అని పర్లాకిమిడి పాఠశాలలో పనిచేసేటప్పుడు యల్లాపంతుల జగన్నాథం గారితో చెప్పడం వంటివన్నీ చూస్తే, సాహిత్యం వ్యాప్తికి కూడా వ్యావహారిక భాషను ఒక సాధనంగా వాడుకున్నారని తెలుస్తుం ది. ఆ తర్వాత జగన్నాథం రాసిన `గాదెల గండడు’అనే బొƒబ్బిలి పాట వరుసలో రాసిన గేయ ప్రబంధానికి `పీఠిక’ కూడా రాశారు. `ముఖలింగ క్షేత్రమహాత్మ్యం’ కావ్యం ఆధారంగా, శాసనాల ఆధారంగా `ముఖలింగ నగర ప్రాచీనత’ను గుర్తించారు. ముఖలింగక్షేత్రం’- `బెనారస్‌’ లాంటి దని క్షేత్రమాహాత్మ్యం వర్ణించిందని, ఆ ఆధారంతో పరిశోధించి దీన్నే ప్రాచీనకాలంలో `జయంతి పురం’ అని పిలిచేవారని నిరూపించారు.
నేటి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గర్లోని కొంకు దురు గ్రామంలో కొన్ని శాసనాలు దొరికాయి. వాటిలో ఒకటి కొంకుదురు శాసనం. అది 1887 లో దొరికింది. దాన్ని మద్రాసు మ్యూజియంలో భద్రపరి చారు. వాటిని పరిష్కరించడానికి రామమూర్తికి పంపితే, దానిలో పేర్కొన్న అంశాలను శ్రీనాథుని `భీమఖండం’ ఆధారంగా పరిశీలించారు. అందులోని అంశాలు అమలాపురం దగ్గర్లోని వెదిరేశ్వరం, పలివెల, ముమ్మిడివరం అనే గ్రామాలకు చెందినవని గుర్తించారు. నాటి సామాజిక స్థితినీ, దానవిశేషాల్ని కావ్యవిశేషాలతో పోల్చి చెప్పారు. సవరలకు సంబంధించిన `సవర పాటలు’ సేకరించారు. 32 పాటలున్న వాటిలో- 30 పాటల్ని సేకరించారు.

20 స్వయంగా రాశారు . సవరల పాటల సేకరణకు చాలా కష్టడ్డారు. వాళ్ళ సంస్కృతిని రక్షించే ప్రయత్నం చేశారంటే, కింది వర్గాల సంస్కృతి పట్ల ఆయనకున్న గౌరవం వ్యక్తమవుతుంది. సవరలపై పరిశోధన చేయాలనుకోవడమే ఆయన సామాజిక దృక్పథాన్ని తెలుపుతుంది. ఆయన రాయాల్సిన విషయాలన్నీ ఆయన కుమారుడు సీతాపతి వ్యాసంగా రాశారు. సవరలను నేడు గిరిజనులుగా గుర్తిస్తున్నారు. వారి గురించి ఐతరేయ బ్రాహ్మణం నుండి అనేక కావ్యాల్లో పేర్కొన్న అంశాలను, సమాజంలో ఉన్న వాస్తవ స్థితిగతుల్ని వివరిస్తూ గొప్ప పరిశోధన చేశారు. సవరలు గంజాం, విశాఖజిల్లాల్లోను, ఒరిస్సా, బెంగాల్‌, సంబల్‌ పూర్‌ మొదలైన ప్రాంతాల్లో ఉండేవారని పేర్కొన్నారు. మహాభారతం, శాంతి పర్వంలో వీరి ప్రస్తావన కనిపిస్తుంది. విశ్వామిత్రుడు శపించిన వారిలో ఒకరిగా పేర్కొన్నారు. రామాయణంలో శబరి నేటి సవరలకు సంబంధించిందే అన్నారు. ఇలా అనేక అంశాలను పరిశోధించారు.గిడుగు వారి పరిశోధనను నడుపల్లి శ్రీరామరాజుగారి అభిప్రాయంతో ముగించడం సముచితంగా ఉంటుందనిపిస్తుంది.`తెలుగు సవర భాషల మీద ఆయన చేసిన అద్భుతమైన పరిశోధనల కంటే, వారు చేసిన అమూల్యమైన శాసన పరిశోధనల కంటే, రచనలలో వాడుక భాషా వ్యాప్తికి వారు చేసిన కృషి కంటే, వారి వ్యక్తిత్వం గొప్పది’. మొత్తం మీద కింది వర్గాల పట్ల, వారి సంస్కృతి-చరిత్రల పట్ల గౌరవభావాన్ని ప్రకటించిన విశిష్ఠ వ్యక్తిత్వం గిడుగు వారిదని- సవరలపై ఆయన చేసిన మొత్తం పరిశోధన కృషి తెలుపుతుంది. వ్యావహారిక భాషోద్యమంలో ఆయన చేసిన వాదాలు, ఉద్యమాలు భాషలోని శక్తిని అందరికీ అందేలా చేసిన ప్రయత్నంగా స్ఫష్టమవుతుంది. ఇవన్నీ ఆయన సామాజిక దృక్పథాన్నీ తెలియజేస్తున్నాయి.
(జనవరి 22 గిడుగు రామమూర్తి పంతులు వర్ధంతి

kubhera mantram

మిత్రులందరికి శుభ శుభోదయం ” ఓం శ్రీ కుబేరాయ నమః ”
“ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్”
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవయంవై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరోవై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః”
“ఓం శ్రీ యక్షరాజాయ ! సకల సౌభాగ్యాదఖండైశ్వర ప్రదాయ ! కుబేరాయ నమః
శ్రీ మహా లక్ష్మీ దేవిని వివిధ రీతులలో పూజించే సాంప్రదాయములు లోకములో గలవు. ఎవరి కోరికలను బట్టి వారు వివిధ నామములతో ఆ మహాదేవిని కొలవవచ్చును. అధికారమును కోరేడి వారు శ్రీ మహా లక్ష్మిని సామ్రాజ్యలక్ష్మీ దేవిగా, “ఓం శ్రీం రాజమాతంగై నమః” …అని ఉపాసించ వలెను. ఐశ్వర్యమును కోరేడి వారు శ్రీ మహాలక్ష్మిని కుబేర మంత్ర సహితముగా పూజించ వలెను. గో సంపద కోరేడి వారు గో శాల యందు కూర్చొని లక్ష్మీ స్తోత్రం చేయ వలెను
ఓం యక్షాయ కుబేరాయ వ్యైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహాః యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్…..
కుబేరుడు (कुबेर) హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
* సంపదనిచ్చే కుబేరుడు *
దిక్పాలకులలో కుబేరుడు ఒకడు. ఉత్తర దిక్కుకు, సమస్త సంపదలకు అధిపతి కుబేరుడు. విశ్రవోబ్రహ్మకు కుమారుడితడు. ఇతని తల్లి ఇలబిల. ఇతని సవతి తమ్ముడు రావణుడు. బ్రహ్మ గురించి తపస్సు చేసిన కుబేరుడు ధనాధిపత్యం, లంక అనే నగరం, నలకూబరుడనే కుమారుడిని వరంగా పొందుతాడు. ఒకసారి అతను తన పుష్పక విమానంలో సంచరిస్తుండగా అది చూసిన రావణుని తల్లి కైకెసి, ఆ విమానము తీసుకురమ్మని ఆదేశిస్తుంది. అప్పుడు రావణుడు ముందు శివుని గురించి తపస్సు చేసి, ఆయనను మెప్పించి అనేక వరాలు పొందుతాడు. తర్వాత కుబేరుడి వద్ద నుంచి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని పొందుతాడు. నలకూబరుడు కాక మణిగ్రీవుడనే మరో కుమారుడు కుబేరుడికి ఉన్నాడు. వేంకటేశ్వరునికి వివాహ సమయంలో ధనాన్ని అప్పుగా ఇచ్చింది కుబేరుడే.
* సంపదనిచ్చే కుబేరుడు *
ఈ విశ్వంలో సంపద ఏదైనా … అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ … మహాపద్మ … శంఖ … మకర … కచ్చప … ముకుంద … కుంద … నీల … వర్చస అనే ‘నవ నిధులు’ ఆయన అధీనంలో వుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?
కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు – ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని ‘వైశ్రవణుడు’ అనీ … ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి, ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని … నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగివుండి … మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి.
కుమారులైన మణిగ్రీవ – నలకూబరులే కాకుండా, అనేకమంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ఆయనను ‘దీపావళి’ రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో …అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
॥శుభం భూయాత్ :- ఓం నమోనారాయణ॥ నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥
: శుభాకాంక్షల కృతజ్ఞతలుతో

కుబేర మంత్రం
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః